రాబోయే ఎన్నికల్లో చంద్రసేనదే విజయం – నిర్మాత అశ్వనీదత్

రాబోయే ఎన్నికల్లో చంద్రసేనదే విజయం అన్నారు నిర్మాత అశ్వనీదత్. స్కిల్ డెవలప్ కేసులో చంద్రబాబు అరెస్ట్ ను ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు అరెస్ట్ ను టీడీపీ శ్రేణులతో పాటు యావత్ తెలుగు వారు తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు. అలాగే చిత్రసీమ లోని కొంతమంది సైతం బాబు అరెస్ట్ ను ఖండించారు.

తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై సినీ పరిశ్రమకు చెందిన నటుడు-నిర్మాత మురళీమోహన్, నిర్మాత అశ్వనీదత్ స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వారు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ పై తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ఏం నేరం చేశారని జైల్లో పెట్టారు అని మురళీమోహన్ ప్రశ్నించారు. చంద్రబాబును చూస్తే చాలా బాధగా ఉందన్న ఆయన గ్రహణం పోయి త్వరలోనే చంద్రబాబు బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే చంద్రబాబు అరెస్ట్ ను నిర్మాత అశ్వనీదత్ ఖండించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రసేనదే విజయం అని కూడా ఆయన జోస్యం చెప్పారు. ఇక మరో పక్క చంద్రసేన 160 సీట్లు సాధిస్తుందన్న అశ్వినీదత్ చంద్రసేన అంటే టీడీపీ ప్లస్ జనసేన అని చెప్పుకొచ్చారు.