త్రివిధ ద‌ళాల ఉమ్మ‌డి నిర్వ‌హ‌ణ దిశ‌గా భార‌త్‌ అడుగులు: రాజ్‌నాధ్ సింగ్‌

Defence Minister Rajnath Singh

న్యూఢిల్లీః ఆర్మీ లాజిస్టిక్స్‌పై జ‌రిగిన సెమినార్‌లో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ మాట్లాడుతూ ..సాయుధ బ‌ల‌గాల‌కు చెందిన త్రివిధ ద‌ళాల ఉమ్మ‌డి నిర్వ‌హ‌ణ దిశ‌గా భార‌త్‌లో వేగంగా అడుగులు ప‌డుతున్నాయ‌ని అన్నారు. ఒక స‌ర్వీసుకు చెందిన వ‌న‌రులు ఇత‌ర స‌ర్వీసుల‌కు సుల‌భంగా అందుబాటులో ఉండే విధంగా చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని చెప్పారు. గ‌త ఏడేండ్లలో రైల్వే రంగంలో శీఘ్ర‌గ‌తిన పురోగతి సాధించామ‌ని, 9000 కిలోమీట‌ర్ల రైల్వే లైన్ల‌ను రెట్టింపు చేశామ‌ని తెలిపారు. పౌర‌, సైనిక వ‌ర్గాల మ‌ధ్య క‌ల‌యిక‌, ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణి ఉండాల‌ని పిలుపు ఇచ్చారు.

స‌మిష్టి త‌త్వం ద్వారా లాజిస్టిక్స్ రంగం బ‌ల‌ప‌డుతుంద‌ని ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ మ‌నోజ్ పాండే, ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ మార్ష‌ల్ వీఆర్ చౌధురి, నేవీ చీఫ్ అడ్మిర‌ల్ ఆర్ హ‌రి కుమార్‌, నీతి ఆయోగ్ స‌భ్యులు వీకే సార‌స్వ‌త్ పాల్గొన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/