రైతుల శ్రేయస్సుకు సిఎం కెసిఆర్‌ నిరంతర కృషి

-మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ వెల్లడి

TS Minister Puvvada Ajay Kumar

Khammam: రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునే రైతు వేదిక లను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ పేర్కొన్నారు..

పంటలను సాగుచేసి దిగుబడులు సాధించాలని రైతులనుద్దేశించి ఆయన పిలుపునిచ్చారు.. రైతువేదిక నిర్మాణం పనుల ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు.

తెలంగాణ రైతులకోసం సిఎం కెసిఆర్‌ అహర్నిశం శ్రమిస్తున్నారని అన్నారు.. రైతులకు మేలు కలిగేలా అన్ని రకాల పథకాలను తెరాస ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు..

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు.

తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/