హైదరాబాద్ ప్రయాణికులకు ఆర్టీసీ తీపి కబురు

హైదరాబాద్ వాసులకు మెట్రో తీపి కబురు తెలిపిందో లేదో..టీఎస్ ఆర్టీసీ సైతం శుభ వార్త తెలిపింది. ఈరోజు నుండి ఉదయం 6 గంటలనుండే మెట్రో సేవలు మొదలుకాగా..సిటీ బస్సులు సైతం ఉదయం నాల్గు నుండే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పాటుగా, ఎంజీబీఎస్, జేబీఎస్ లలో కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచే సిటీ బస్సులను అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు.
తెల్లవారుజామును ఇతర ప్రాంతాల నుంచి బస్సులు, రైళ్లలో వచ్చే ప్రయాణికులకు ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. తెలవారు జామును 3-4 గంటలకు వచ్చే ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరకునేందుకు ప్రవైట్ వాహనాలను నమ్ముకుంటున్నారు. దీంతో వారు అడిగిందంతా ఇచ్చి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. కానీ ఇక నుండి ఉదయం నాల్గు గంటల నుండే సిటీ బస్సులు అందుబాటులోకి వస్తే వారి జేబులు ఖాళీ కావాల్సిన అవసరం ఉండదు. టీఎస్ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.