‘ములుగు ప్రాంతాన్ని ఎడారిగా మార్చే కుట్ర’

ఎమ్మెల్యే సీతక్క ఆరోపణ

Mulugu MLA Seethakka
Mulugu MLA Seethakka

Mulugu: ములుగు ప్రాంతాన్ని ఎడారిగా మార్చే కుట్రను ప్రభుత్వం విరమించుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

ఈప్రాంత నీటి అవసరాలు తీర్చాకనే ఇతర ప్రాంతాలకు నీరు తరలించాలని ఆమె అన్నారు. ఏటూరు నాగారం దేవాదుల వద్ద కాంగ్రెస్  తలపెట్టిన జలదీక్షను పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో అర్ధరాత్రి నుండి గృహ నిర్భంధంలోనేములుగు ఎమ్మెల్యే సీతక్క ఉండాల్సి వచ్చింది.

ఉత్తర తెలంగాణ అదిలాబాద్‌ నుండి ఖమ్మంవరకు మొత్తం గోదావరి పరివాహక ప్రాంతం అయినప్పటికీ  ఈ ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వకుండా, ఇతర ప్రాంతాలకు నీళ్ళు తీసుకుపోయే కుట్ర జరుగుతోందన్నారు.

9 మండలాల్లో తలుపునే గోదావరి ఉన్న తాగటానికి నీళ్ళు లేవని అన్నారు.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/