నాగోల్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ప్రారంభం
పాల్గొన్న మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి

Hyderabad: అర్హులైన లబ్దిదారుల కోసం ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను శనివారం మంత్రులు ప్రారంభించారు.
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని నాగోల్ డివిజన్‌లో ఎరుకల నాంచారమ్మనగర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు..
సుమారు రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించిన 288 డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను మంత్రుల ప్రారంభించి లబ్దిదారులకు అందజేశారు..
కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం పాల్గొన్నారు..
తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/