ఓటు మనకు వజ్రాయుధం లాంటిది – కేసీఆర్

CM KCR Public Meeting at balkonda

గులాబీ బాస్ , సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో మరింత పదునైన డైలాగ్స్ పేలుస్తూ ప్రత్యర్థుల ఫై విమర్శలతో రెచ్చిపోతున్నారు. గత కొద్దీ రోజులుగా ప్రజా ఆశీర్వాద సభ ల పేరుతో జిల్లాలో సభలు ఏర్పాటు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు ముధోలే, ఆర్మూర్, కోరుట్లలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ , బిజెపి పార్టీల ఫై నిప్పులు చెరిగారు. ఓటు మనకు వజ్రాయుధం లాంటిది. అదే మన తలరాతను మారుస్తుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎవరేం చేసారన్నది ఆలోచించి ఓటు వేస్తే మంచిదని సీఎం సూచించారు. ఎన్నికలు వస్తాయి.. పోతాయి.. అభ్యర్థి గుణగణాలతో పాటు.. పార్టీ ఎలాంటిదో కూడా చూడాలని ప్రజలను సీఎం కోరారు. గెలిచిన ఎమ్మెల్యేల ద్వారానే ప్రభుత్వం ఏర్పడుతుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. మీరు కిందా మీద చేస్తే.. తప్పుడు ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయని కేసీఆర్‌ అన్నారు. ఆ పార్టీల నడవడిక, చరిత్ర తెలుసుకోవాలి. ప్రజల కోసం, రైతుల కోసం ఆయా పార్టీలు ఏం చేశాయో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల తీరును, మాటలను ఎక్కడికక్కడ ఎండగడుతూ ఏకిపారేశారు. ‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే తెల్ల రేషన్‌ కార్డుదారులందరికీ సన్నబియ్యం ఇస్తం. కాంగ్రెస్‌, బీజేపీలను నమ్మవద్దు. నమ్మి మోసపోవద్దు అన్నారు.