సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ తనిఖీ చేసిన పోలీసులు

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో పోలీసుల తనిఖీలు మరింత ముమ్మరం చేసాయి. ప్రతి చెక్ పోస్ట్ వద్దే కాకుండా రోడ్ల ఫై కూడా ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తూ..ఆధారాలు లేని డబ్బు , బంగారాన్ని పట్టుకొని సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ నేతల వాహనాలను సైతం తనిఖీలు చేస్తూ వస్తున్నారు.

తాజాగా ఈరోజు సీఎం కేసీఆర్ నేడు బైంసా, ఆర్మూర్, కోరుట్ల నియోజకవర్గాల్లో సభల కోసం హైదరాబాద్ నుంచి నిజామాబాద్ బయలుదేరారు. ఈ సమయంలో కేంద్ర బలగాల నిఘా బృందం కేసీఆర్ కాన్వాయ్‌ని తనిఖీ చేసింది. ఇటీవల మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌ల కాన్వాయ్‌లను కూడా అధికారులు తనిఖీ చేశారు.