త‌న నియోజ‌క‌వ‌ర్గం కోసం పాటు ప‌డే వ్య‌క్తి జీవ‌న్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలిః సిఎం కెసిఆర్‌

CM KCR Public Meeting at armoor

ఆర్మూర్ : ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కెసిఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఇది ఆర్మూరు జ‌న‌మా.. ప్ర‌భంజ‌న‌మా.. అని కెసిఆర్ పేర్కొన్నారు. ఆర్మూర్‌లో ఒక విష‌యం అయితే తేలిపోయింది. ఈ స‌భ స‌ముద్రాన్ని చూసిన త‌ర్వాత జీన‌వ్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచిపోతార‌ని స్ప‌ష్టంగా తేలిపోయింది. జీవ‌న్ రెడ్డి ప్ర‌త్యేక‌త ఏంటంటే.. తెలంగాణ ఉద్య‌మంలో ఉండి.. ఎర్ర జొన్న రైతుల‌కు కోసం ఆర‌మ‌ణ దీక్ష చేశారు. ఫైరింగ్ జ‌రిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పోలీసు కాల్పులు జ‌రిపింది. నేను ఎక్క‌డ్నో క‌రీంన‌గ‌ర్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నాను. ఇక్క‌డ కాల్పులు జ‌రిగాయిని తెలిస్తే హుటాహుటిన ఆర్మూర్‌కు వ‌చ్చాను. అప్ప‌ట్నుంచి నాకు స‌న్నిహితుడై కుటుంబంలో ఓ స‌భ్యుడిగ‌లా ఉండి, పార్టీని ముందుకు తీసుకుపోతున్నారు జీవ‌న్ రెడ్డి. ఏదైనా కావాలంటే.. వెంబ‌డి ప‌డి సాధిస్త‌డు జీవ‌న్ రెడ్డి. మండ‌లాలు కావాలంటే అవ‌స‌ర‌మా అని ప్ర‌శ్నించాను. జీవ‌న్ రెడ్డి మూడు రోజులు అలిగి కూర్చుండు. అలా ప‌ట్టుద‌ల‌తో, పంథాతో న‌మ్ముకున్న ప్ర‌జ‌ల కోసం ప‌నులు చేయిస్త‌డు. అందుకే మీ అభిమానం ఈరోజు క‌న‌బ‌డుతుంది. మీ కోస‌మే ప‌ని చేసే వ్య‌క్తి.. భారీ మెజార్టీతో గెలిపించాలి. కొంద‌రు ఇప్పుడొచ్చి ఆప‌ద‌మొక్కులు మొక్కుతారు. అవ‌న్నీ న‌మ్మ‌కండి. ప్ర‌జ‌ల కోసం ప‌ని చేసే వ్య‌క్తి.. త‌న నియోజ‌క‌వ‌ర్గం కోసం పాటు ప‌డే వ్య‌క్తి జీవ‌న్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి అని అన్నారు.

బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కెసిఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత ఒక్కో సమస్యను పరిస్కరించుకున్నాం. రైతు బంధు కావాలని ఎవ్వరూ అడగలేదు.. అయినా మనం రైతుల కోసం ఆలోచించి రైతుబంధు, రైతుబీమా గురించి చెప్పారు. రైతుబంధు పథకానికి అంతర్జాయంగా ప్రశంసలు వస్తున్నాయి. వెనుకబడిన దళితుల కోసం దలిత బంధు తీసుకొచ్చామని తెలిపారు. ఈ పథకాన్ని జవహర్ లాల్ తీసుకొస్తే.. దళితులకు ఎప్పుడో మేలు జరిగేది.

ప్రజల చేతిలో ఉండే వజ్రాయుధం ఓటు.. ఓటును జాగ్రత్తగా వినియోగించాలి. ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్ రెడ్డి భారీ మేజార్టీతో గెలిపిస్తారని ఆశీస్తున్నా. అంకాపూర్ కి ఉన్న ప్రత్యేకత గురించి అందరికీ తెలిసిందే. అంకాపూర్ గురించి ఎక్కువగా ప్రచారం చేసింది తానేనని చెప్పారు. ఆర్మూర్ లో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు.. ఆ ఆసుపత్రిలో గర్భీణీలకు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. కెసిఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లను రాష్ట్ర వ్యాప్తంగా అందజేస్తున్నామని వెల్లడించారు.