ప్రజలు కోరుకుంటే జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీ: సీఎం కెసిఆర్

కేంద్రంతో అమీతుమీకి సిద్ధమైన కేసీఆర్

హైదరాబాద్ : కేంద్రంపై యుద్ధం ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయస్థాయిలో పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి పార్టీ (బీజేపీ) అధికారంలో ఉండనే కూడదని ఆయన కరాఖండీగా చెప్పారు. ముఖ్యంగా, ప్రజలు కోరుకుంటే జాతీయస్థాయిలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తామని అన్నారు. అవసరం అనుకుంటే కొత్త పార్టీ ఏర్పాటుకు వెనుకంజవేయబోమని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

గతంలో తాను టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేస్తే అందరూ నవ్వారని, ఇప్పుడు ఏమైందని తిరిగి ప్రశ్నించారు. జాతీయ పార్టీ పెట్టినా విజయవంతం కాగలమన్న నమ్మకం ఉందని అన్నారు. ఇది ప్రజాస్వామ్యం అని, జాతీయస్థాయిలో పార్టీ పెట్టే దమ్ము తనకుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలు తలుచుకుంటే ఏదైనా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి నటులు సీఎంలు అయ్యారు… టీ అమ్ముకునే తానే ప్రధానిని అయ్యానని మోడీ చెప్పారు… ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? ఏదో ఒకటి జరగడం మాత్రం ఖాయమని ధీమాగా చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/