వేములవాడలో నేటి నుంచి హెలీకాప్టర్‌ సేవలు

నాలుగు రోజులపాటు అవకాశం..మూడు రకాల ప్యాకేజీలు

వేములవాడ: మహా శివరాత్రి సందర్బంగా రాజన్న సన్నిధిలో బుధవారం నుంచి హెలికాప్టర్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు హెలిట్యాక్సీ సంస్థ ప్రతినిధులు మంగళవారం రాత్రి రాజన్న గుడి చెరువు కట్టపై స్థల పరిశీలన చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు గగనతలంలో 7 నిమిషాలపాటు తిరిగేందుకు ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున తీసుకోనున్నారు. ఈ విషయాన్ని మంత్రి అల్లోల తెలిపారు. భక్తులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించి స్వామివారిని దర్శించుకోవాలని సూచించారు.

నాంపల్లి గుట్ట, వేములవాడ పట్టణం చుట్టూ తిప్పుతూ తిరిగి గుడి చెరువు వద్దకు తీసుకువస్తారు. 15 నిమిషాలు గగనతలంలో విహరించేందుకు ఒక్కొక్కరికి రూ.5,500 తీసుకొని నాంపల్లి గుట్ట, మిడ్‌మానేరు చూపించనున్నారు. హెలికాప్టర్‌ ఒక్కో ట్రిప్పులో ఐదుగురి చొప్పున తీసుకెళ్తారని అధికారులు తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/