గాంధీ కి నివాళ్లు అర్పించిన మోడీ

నేడు మహాత్మా గాంధీ 153వ జయంతి సందర్భంగా ప్రముఖులు గాంధీకి నివాళ్లు అర్పిస్తున్నారు. ఆదివారం రాజ్ ఘాట్ లోని గాంధీ సమాధి వద్దకు వెళ్ళిన ప్రధాని పుష్పగుచ్చాన్ని ఉంచి నివాళులు తెలిపారు. దేశ స్వాతంత్య్ర పోరాటానికి గాంధీ నాయకత్వం వహించడం తెలిసిందే. గాంధీ తన ఉద్యమంలో ఎప్పుడూ శాంతికే ప్రాధాన్యం ఇచ్చారు.

ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘మహాత్మా గాంధీకి నివాళులు. నేటి గాంధీ జయంతి మరింత ప్రత్యేకం. ఎందుకంటే భారత్ ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటోంది. బాపూ సిద్ధాంతాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. ప్రజలు ఖాదీ, చేతి ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా గాంధీకి నివాళి అర్పించాలి’’అని ప్రజలకు పిలుపునిచ్చారు. మోడీ తో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ , ప్రధాని మోడీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో పాటు పలువురు ప్రముఖలు నివాళ్లు అర్పించారు.

“ఈ గాంధీ జయంతి(153) మరింత ప్రత్యేకమైనది. దేశమొత్తం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఖాదీ, హస్తకళల ఉత్పత్తులను కొనుగోలు చేయండి… అదే గాంధీజికి నిజమైన నివాళి” అంటూ ఉదయం ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ‘గాంధీమార్గం’ అనేది నాలుగక్షరాల పదం కాదు- అక్షరాలా అగ్నిపథం. సత్యసంధత, నమ్మిన సిద్ధాంతాల పట్ల నిబద్ధత- ఆయనను మహాత్ముణ్ని చేశాయి. ఆచరణ విషయంలో ఆయనది అనుష్ఠాన వేదాంతం. ప్రజలు అసంఖ్యాకంగా గాంధీని అనుసరించడానికి కారణం- ఆయన ప్రవచించిన సిద్ధాంతాలు కావు. పాటించిన విలువలు.. అతడు అహింసకు అక్షరాభ్యాసశాల, అతడు సత్యసంధతకు వ్యాఖ్యాన శైలి, అందుకే మహాత్ముడై రహించెను.. అన్నది ప్రత్యక్షర సత్యం. ఆయన చూపిన మార్గంలో నడుస్తామని ప్రతిజ్ఞలు చేస్తారు. భారతీయులు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రత్యేకమైన రోజును అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటారు.