మరోసారి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
క్షిపణి ప్రయోగాన్ని ధ్రువీకరించిన జపాన్

ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా ఇతర దేశాల హెచ్చరికలు, ఆందోళనలను లెక్క చేయకుండా మరోసారి దీర్ఘశ్రేణి ఖండాంతర క్షిపణిని పరీక్షించింది. రోజుల వ్యవధిలో కొరియా అణు క్షిపణులను పరీక్షించడం ఇది మూడోసారి. ప్యాంగాంగ్ లోని సునాన్ ప్రాతంలో దీన్ని ప్రయోగించారని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. క్షిపణి ప్రయోగాన్ని జపాన్ కూడా ధ్రువీకరించింది. కొరియన్ పీఠభూమికి 550 కిలోమీటర్ల దూరంలో ఉన్న జపాన్ ఎక్స్ క్లూజివ్ ఎకనామిక్ జోన్ అవతల మిస్సైల్ పడి ఉండొచ్చని తెలిపింది. ఈ నెల 14న కూడా రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిస్సైల్స్ ను ఉత్తర కొరియా పరీక్షించింది. ఈ క్షిపణులను తూర్పు తీర జలాల్లోకి ప్రయోగించింది. దక్షిణ కొరియా, జపాన్ అధ్యక్షులు సమావేశం కానున్న తరుణంతో ఉత్తర కొరియా ఈ ప్రయోగాలను చేపట్టడం గమనార్హం.
కాగా, మంగళవారం ఉదయం స్థానిక కాలమానం ప్రకారం ..7.41 గంటల నుంచి 10 నిమిషాల వ్యవధిలో రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపింది. అదనపు ప్రయోగాలకు సన్నాహకంగా తమ సైన్యం నిఘా, అప్రమత్తతను బలోపేతం చేసిందని జేసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది