ఏలూరు లో దారుణం : మహిళా అటెండర్‌ పై సబ్‌ రిజిస్టార్‌ లైంగిక దాడి

ఏపీలో మహిళల ఫై లైంగిక దాడులు ఏమాత్రం ఆగడం లేదు. ఓ పక్క ప్రభుత్వం కఠిన శిక్షలు అమలు చేస్తున్నప్పటికీ కామాంధులు వారి ఆగడాలను ఆపడం లేదు. ఆఖరికి ప్రభుత్వ ఆఫీస్ లలో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. తాజాగా ఏలూరు లో మహిళా అటెండర్‌ పై సబ్‌ రిజిస్టార్‌ లైంగిక దాడికి పాల్పడడం కలకలం రేపుతోంది.

రిజిస్టార్ కార్యాలయంలోని ఆడిట్ సెక్షన్ లో అటెండర్ గా పనిచేస్తున్న ఓ వివాహిత పై సబ్ రిజిష్టార్ జయరాజు కన్నేశాడు. గత కొద్ది రోజులుగా తన కోరిక తీర్చాలంటూ ఆమెను విధించడం మొదలుపెట్టాడు. రోజు రోజుకు జయరాం ఆగడాలు ఎక్కువై పోతుండడంతో సదరు మహిళా జిల్లా రిజిస్టార్లో పిర్యాదు చేసింది. దీంతో జయరాజు ను ఫై అధికారులు మందలించారు. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాక పోగా తన కోరిక తీర్చకపోతే ప్రాణహాని తలపెడతానని బెదిరింపులకి పాల్పడ్డాడు. దీంతో అధికారుల సూచనల మేరకు దిశా పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసింది వివాహిత. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.