ఇళ్లులేని నిరుపేదలకు కేసీఆర్ గుడ్ న్యూస్

cm kcr

తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇళ్లులేని నిరుపేదలకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటికే పట్టణాల్లో , నగరాల్లో ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తున్న సర్కార్..ఇప్పుడు సొంత స్థలం ఉండి, ఇల్లు లేని వారికీ ఆర్ధిక సాయం అందించబోతుంది. సొంత జాగా ఉన్న పేదలకు ఇళ్ల నిర్మాణానికి రూ. 3 లక్షల సాయాన్ని అందించే పథకాన్ని 15 రోజుల్లో ప్రారంభిస్తామని రీసెంట్ గా సీఎం కేసీఆర్‌ ప్రకటన చేయడం జరిగింది.

పేదలందరికీ ప్రభుత్వమే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి భారీగా స్థలసేకరణ చేయాల్సి ఉంటుంది. అది అసాధ్యమని భావించిన సీఎ కేసీఆర్.. సొంత జాగా ఉన్నవారికి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. దీనిపై గతంలో పలుమార్లు ప్రకటనలు కూడా చేశారు. ఈ నెల 10న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో జరగనున్న క్యాబినెట్‌ భేటీలో పేదలకు రూ.3 లక్షల ఆర్థికసాయం పథకంపై చర్చించనున్నారు. ఆ వెంటనే ప్రభుత్వం ఈ పథకంపై ప్రకటన చేయన్నుట్లు తెలుస్తోంది.

ఇక ఈ పథకం పొందాలనుకునే ఈ అర్హతలు కలిగి ఉండాలి

  • అర్హులకు సొంత ఖాళీ స్థలం ఉండి.. తెల్ల రేషన్‌ కార్డు ఉండాలి
  • ఇంటి నిర్మాణానికి కనిష్ఠంగా 75 గజాల స్థలం ఉండాలి
  • కుటుంబంలోని మహిళ పేరిటే ఈ సాయాన్ని అందిస్తారు.
  • డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం జరగని గ్రామాలకు మెుదటి ప్రాధాన్యం
  • గత ప్రభుత్వాల హయాంలో ఇందిరమ్మ ఇళ్లు పొందినవారు ఈ పథకానికి అనర్హులు
  • ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర కులాలకు చెందిన లబ్ధిదారులకు కూడా రూ. 3 లక్షలే
  • రూ.3 లక్షల సాయాన్ని విడతల వారీగా అందజేస్తారు.
  • ఎమ్మార్వో, ఎంపీడీవోలు లబ్ధిదారులను గుర్తిస్తే కలెక్టర్‌ ఆమోదిస్తారు.
  • అయితే.. ఎమ్మెల్యేలు, మంత్రుల పరిశీలన తర్వాతే ఎంపిక జరుగుతుంది.