ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కన్నీరు పెట్టుకున్న శివాత్మిక

జీవిత రాజశేఖర్ దంపతుల కూతురు శివాత్మిక ‘పంచతంత్రం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ‘దొరసాని’ సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీ కి పరిచమైన శివాత్మిక ..ఆ మూవీ దారుణమైన ఫలితాన్ని ఇవ్వడంతో కాస్త నిరాశకు గురైంది. ఆ తరవాత ఆమె ఒక తమిళ సినిమాలో నటించింది. అది కూడా మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు ‘పంచతంత్రం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, స‌ముద్రఖ‌ని, రాహుల్ విజ‌య్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్పల ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ.. మొత్తం ఐదు కథలుగా తెరకెక్కింది. డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ క్రమంలో చిత్ర ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హరీష్ శంకర్, జీవితా రాజశేఖర్ అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ ఎమోషనలకు గురైంది.

అఖిలేష్.. ఈ సినిమా మీ వల్లే, మీ కోసమే చేశాను. తను చేస్తావా అని కూడా అడగలేదు. నువ్వే చేస్తావు అని చెప్పారు. థాంక్యూ.. నన్ను అంత నమ్మినందుకు. నేను ఈ సినిమాలో నటించడానికి మరో కారణం ఉష. ఆమెకు కూడా థాంక్యూ. నువ్వు ఇంత మంచి కథ రాస్తావని ఎదురుచూడలేదు హర్ష. నువ్వు నెరేట్ చేసినప్పుడే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇప్పటికి కూడా లేఖ పాత్రకు న్యాయం చేశాననే నమ్మకం అయితే నాకు రావట్లేదు. ఇంకా భయం భయంగానే ఉంది. ఒక అందమైన క్యారెక్టర్ అది. థాంక్యూ హర్ష నన్ను నమ్మినందుకు’’ అని తెలిపింది.