ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన మహేశ్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. ఇప్పటికే పలు వ్యాపారాలు చేస్తూ వస్తున్న మహేష్..ఇప్పుడు తన భార్య పేరుతో రెస్టారెంట్ ఏర్పటు చేసారు. ఏఎన్ పేరుతో రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఏ అంటే ఏషియన్… ఎన్ అంటే ఆయన భార్య పేరు నమ్రత అని తెలుస్తుంది. బంజారాహిల్స్ లో తెలంగాణ భవన్ పక్కనున్న ప్యాలస్ హైట్స్ లో ఈ రెస్టారెంట్ ను ప్రారంభించారు.

పూజాకార్యక్రమాలతో నమ్రత రెస్టారెంట్ ను ఓపెన్ చేశారు. ఈరోజు నుంచి రెస్టారెంట్ నగరవాసులకు అందుబాటులోకి రానుంది. రెస్టారెంట్ ఎంతో గ్రాండ్ గా ఉంది. ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయని చెపుతున్నారు. దుబాయ్ లో ఉన్న మహేశ్ బాబు ఈరోజు రెస్టారెంట్ కు రానున్నట్టు సమాచారం. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోగా , త్వరలో రెండో షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు. ఇక ఈ ఏడాది మహేష్ కు తీరని లోటును మిగిల్చిన సంగతి తెలిసిందే. అన్న, అమ్మ, తండ్రి ని మహేష్ కోల్పోయారు. ఈ బాధలో నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు.