అమెరికా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలిః యూఎస్ వార్నింగ్

వాషింగ్టన్‌ః ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అధినేత అల్‌జవహరిని అమెరికా బలగాలు హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో అమెరికా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అగ్రరాజ్యం హెచ్చరికలు జారీ చేసింది. ‘‘అల్‌జవహరి మరణం నేపథ్యంలో.. అల్‌ఖైదా మద్దతుదారులు అమెరికా కార్యాలయాలు, అధికారులు, పౌరులపై దాడులు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. విదేశాలకు ప్రయాణాలు చేసే సమయంలో పరిస్థితులను గమనిస్తూ ఉండండి’’ అని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/movies/