మొక్కజొన్న రైతులకు కేసీఆర్ తీపి కబురు

మొక్కజొన్న రైతులకు సీఎం కేసీఆర్ తీపి కబురు తెలిపారు. యాసంగి మొక్కజొన్న పంటలను కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్..అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. అలాగే మొక్కజొన్న క్వింటాలకు ప్రభుత్వం మద్దతు ధర రూ. 1962 గా నిర్ణయించారు.

ప్రధానంగా మొక్కజొన్నను ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో సాగుచేశారు. అయితే ఇటీవల అకాల వర్షాలకు పలు జిల్లాలలో మొక్కజొన్న పంట కొంత దెబ్బతిన్న తరుణంలో ప్రభుత్వం కొనుగోలుకు నిర్ణయం తీసుకోవడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6.50 లక్షల ఎకరాలలో మొక్కజొన్న సాగు అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా 17.37 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని చెబుతున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మంత్రి నిరంజన్ రెడ్డి ఏర్పాట్లు చేయబోతున్నారు.