పవన్ అలా లుంగీ పైకి ఎగ్గట్టుతూ వస్తుంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా కలయికలో తెరకెక్కిన భీమ్లా నాయక్ సంక్రాంతి బరిలో వస్తుందని అంత అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఈ మూవీ సంక్రాంతి బరి నుండి తప్పుకుంది. ఈ వార్త తో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తూ..చిత్ర నిర్మాతల ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి ఆగ్రహాన్ని చల్లార్చేపనిలో ఉంది చిత్ర యూనిట్. సినిమా తాలూకా విశేషాలు , స్టిల్స్ రిలీజ్ చేస్తూ అభిమానుల్లో సంతోషం నింపుతున్నారు. తాజాగా పవన్ తాలూకా మాస్ లుక్ ను రిలీజ్ చేసారు.

పవన్ అలా లుంగీ పైకి ఎగ్గట్టుతూ ఉన్న పిక్ రిలీజ్ చేసారు. ఈ పిక్ రిలీజ్ అయినా కాసేపటికే వైరల్ గా మారింది. పవన్ ఆలా లుంగీ పైకి ఎగ్గట్టుతూ వస్తుంటే అభిమానుల కళ్లు రెండు కూడా చూడ్డానికి చాలడం లేదు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ను భీమ్లా నాయక్ గా త్వరగా చూడాలనే ఆసక్తి కోరిక ఈ ఫొటో మరింతగా పెంచింది అనడంలో సందేహం లేదు. భీమ్లా నాయక్ కు సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ రచన సహకారం అందించాడు. నిత్యా మీనన్ ను ఈ సినిమా లో పవన్ కు జోడీగా నటింపజేశారు. ఆమె పాత్ర చాలా విభిన్నంగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది అంటూ మేకర్స్ చెబుతున్నారు. భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ పోలీస్ గా కనిపించబోతుండగా.. నిత్యా మీనన్ మాత్రం మాజీ నక్సల్ గా కనిపించనున్నట్లుగా తెలుస్తోంది.