కశ్మీర్ భారత్‌దే..తాలిబన్ స్పష్టం
భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసిన తాలిబన్

కాబూల్: కశ్మీర్ ఎప్పటికీ భారత్‌దేనని, ఆదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని తాలిబన్ స్పష్టం చేసింది. ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్ఘనిస్తాన్(తాలిబన్) మీడియా ప్రతినిధి సుహైల్ షాహీన్ ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. పాకిస్తాన్ నేతృత్వంలో కశ్మీర్లో జిహాద్‌కు తాలిబన్ రంగంలోకి దిగుతుందని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఏ దేశ అంతర్గత వ్యవహారాల్లో తాము తలదూర్చబోమని అన్నారు. కశ్మీర్ సమస్య పరిష్కారం అయ్యే వరకు భారత్‌తో స్నేహం చేసేది లేదంటూ తాలిబన్ మీడియా ప్రతినిధి జబీహుల్లా ముజాయిద్ అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో.. రంగంలోకి దిగిన తాలిబన్ ప్రతినిధులు అలాంటిదేమీ లేదని, ఆ దేశంతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/