తెలంగాణలో ప్రారంభమై ఆర్టీసీ బస్సులు

మాస్కు ధరిస్తేనే బస్సులోకి

TSRTC – buses

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుండి ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. సిఎం కెసిఆర్‌ నేటి నుండి ఆటోలు, క్యాబ్‌లు, సెలూన్లు, ఆర్టీసీ బస్సులు నడపవ్చని ప్రకటించడంతో అందుకనుగుణంగా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. కాగా లాక్‌డౌన్ కారణంగా దాదాపు రెండు నెలల పాటు బోసిపోయిన బస్టాండ్లు ప్రయాణికులతో మళ్లీ కళకళలాడాయి. ఉదయం ఆరు గంటలకే బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. బస్సులను, బస్టాండ్లను అధికారులు పూర్తిగా శానిటైజ్ చేశారు. మాస్కులు ధరించిన వారినే బస్సుల్లోకి అనుమతిస్తున్నారు. జిల్లాల నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చే బస్సులను నగర శివారు వరకే అనుమతించనున్నారు. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల నుంచి వచ్చే బస్సులను హయత్‌నగర్ వరకు మాత్రమే అనుమతించనున్నారు. సాయంత్రం ఏడుగంటలకు మాత్రమే బస్సులు తిరుగుతాయి. ఆ తర్వాత సర్వీసులు నిలిపివేస్తారు. అయితే, అప్పటికే టికెట్లు జారీ చేసి ఉంటే కనుక మరో గంట అదనంగా బస్సులు నడుస్తాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/