కార్తీక పురాణం

ఆధ్యాత్మిక చింతన

Karthika Puranam-
Karthika Puranam-

జనక మహారాజుకు వశిష్ఠుడు కార్తీకమాసంలో ఉసిరి చెట్టుకింద పురాణకాలక్షేపం చేస్తే మంచిదని తెలియచేయటానికి చెప్పిన కథ ఇది. కావేరీ తీరమందు ఒక గ్రామములో దేవశర్మ అను బ్రాహ్మణుడుండేవాడు.

అతని పుత్రుని పేరు శివవర్మ. అతడు దుష్ట సహవాసముచేసి, దురాచారపరుడై కాలమును వ్యర్థపరచేవాడు. తండ్రి దేవశర్మ అతనితో ‘బిడ్డా! నీ దురాచారములకు అంతులేదు. ప్రజలు పలు విధములుగా అంటుంటే సిగ్గుపడి నలుగురిలో తిరగలేకపోతున్నాను.

నీవు కార్తీక మాసములో నదిలో స్నానముచేసి, శివకేశవులను స్మరించి, సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన యెడల నీ పాపములు నశించుటేకాక నీకు మోక్ష ప్రాప్తి కలుగును. అని చెప్పాడు. అప్పుడు శివశర్మ ‘స్నానముచేసేత, దీపం వెలిగిస్తే ఏమి లాభం? అన్నాడు. తండ్రికి కోపం వచ్చి ‘ఓరీ నీచుడా! కార్తీక మాసఫలమును గూర్చి అంత చులకనగా మాట్లాడుతావా? అడవిలో ఒక రావి చెట్టు తొర్ర యందు ఎలుకవైపోదువుగాక అని శపించాడు.

కొడుకు భయపడి తండ్రి నన్ను క్షమంచు. నాకు శాపవిమోచనము ఎట్లో చెప్పండి అని కోరాడు. నీవెప్పుడు కార్తీక మహాత్మ్యమను వినగలో అప్పుడు శాపవిమోచనము కల్గుతుంది అన్నాడుతండ్రి. వెంటనే శివశర్మ ఎలుకయై అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివశించుచుండెను. కొన్ని రోజుల తర్వాత విశ్వామిత్ర మహర్షి శిష్యసమేతంగా కావేరీ నదిలో స్నానార్థమై వచ్చారు.

ప్రయాణ బడలికవల్ల ఆ వట వృక్షంకింద విశ్రమించారు. కొంత విరామం తర్వాత విశ్వామిత్ర మహర్షి, ఆయన శిష్యులు నదికి పోయి స్నానం చేసి మళ్లీ ఆ వటవృక్షం కిందకు వచ్చి కూర్చొన్నారు. మహార్షి తన శిష్యులకు కార్తీక పురాణమును వినిపిస్తూ కార్తీక మాస మహత్యాన్ని గూర్చి చెబుతుండిరి.

తొర్రలో నివశిస్తున్న ఎలుక వారి వద్దనున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు తనకు దొరుకు తుందేమోనని తొర్రలో నుంచి బయటికి వచ్చింది. అదే సమయంలో అక్కడున్న వారి వద్దనున్న విలువైన వస్తువులను దోచుకోవటానికి ఒక కిరాతుడొచ్చాడు. కానీ అక్కడ వారు పఠిస్తున్న కార్తీక పురాణమువిని ఎలుక తన పూర్వపుబ్రాహ్మణ రూపమును పొందింది.

కిరాతుడు మంచి వాడై వారికి ప్రణమిల్లి వాని పల్లెకు వెళ్లిపోయాడు. ధన్మోస్మి తమ దయవల్ల నేను ఈ మూషిక రూపంనుండి విముక్తుడనైతిని అని శివశర్మ తన వృత్తాంతమంతా చెప్పి మహర్షికి నమస్కరించి వెళ్లి పోయాడు.

కార్తీక మాసంలో ఇంటి గొడవలను పక్కనపెట్టి ఊరికి దూరంగా అడవిలకి వెళ్లటం మంచిదే. చెట్ల కింద గడపట ఆరోగ్యకరమే ఏదో ఒక పురాణ పఠనం చేసి అందులోని మంచి చెడుగులను గూర్చి చర్చించటం మన వివేకవికాసానికి తోడ్పడుతుందనటంలో సందేహములేదు.

నదీ స్నానం ఎంత మానసిక ఉల్లాసాన్ని కల్గిస్తుందో వేరే చెప్పనక్కరలేదు. కథలోని సద్బ్రాహ్మణుడు, ఎంతో తెలిసినవాడు. అంత త్వరగా ఆవేశానికి లోనై సొంత కొడుకును ‘ఎలుకవైపో అని శపించటం లభ్యంతరకమే. అయినా వారు ఆనాటి బ్రాహ్మణులు కదా!

అడుగడుగునా శాస్త్రానుసారంగా జీవించేవారు కదా! రచించి పురాణంలో జూప్పించాడా? ప్రజలను మభ్యపెట్టి తమ స్వార ్థప్రయోజనాలను తీర్చుకునేందుకు బ్రాహ్మణులు పురాణాలు రచించారన ఇకొందరంటుంటారు.

మరి ఈ పురాణ కథ అలా లేదే? వారినే నిందిస్తూ ఉన్నదే సంకుచితత్వాన్ని వదలి మంతచినే గ్రహిద్దాం.

  • రాచమడుగు శ్రీనివాసులు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/