దక్షిణాయనం

ఆధ్యాత్మిక చింతన

Daksinayanam
Daksinayanam

షణ్మసో దక్షిణేనేతి, షడుత్తరేణేతి… అంటూ మన వేదాలలో ముందుగా ప్రస్తావించింది దక్షిణాయనం గురించే, ఆ తరువాతే ఉత్తరా యనం గురించి చెప్పబడింది.

మన తెలుగుమాసాల ప్రకారం కూడా ముందుగా ఆషాడమాసంలో దక్షిణాయనం వస్తుంది.

తరువాతే పుష్యమాసంలో ఉత్తరాయనం వస్తుంది. ఉత్తరాయనం శుభమని, దక్షిణాయనం అంత గొప్పది కాదనే భావన మనందరిలోవున్నాయి.. నిజానికి లోతుగా పరిశీలిస్తే దక్షిణాయనమే ఉత్తరమైనది.

కర్కాకటరాశిలో సూర్యుడు ప్రవేశించే సమయం నుండి ఆరుమాసాలని దక్షిణాయం అంటారు. నిజానికి పన్నెండు రాశులకి పన్నెండు సంక్రమణాలు వున్నాయి.

ఈ సంక్రమణములను ‘విశువములు, ‘విష్ణుపద, ‘షడశీతి, ‘ఆయన సంక్రమణములుగా విభజించారు. కర్కాటకం, మకరంలో జరిగి సంక్రమణంలనే ‘ఆయన సంక్రమణాలు అంటారు. అందుకే ఉత్తరా’యనం, దక్షిణా’యనం అన్నారు.

ప్రధానం చెప్పుకోవలసిన సంక్రమణములు ఈ రెేం. విశువు కంటే, విష్ణుపది, విష్ణుపది కంటే షడశీతి, షడశీతి కన్నా ‘ఆయన సంక్రమణములు గొప్పవి. అందుకే దక్షిణాయనం, ఉత్తరాయనం గొప్పవి. దక్షిణాయన ప్రారంభానికి ముందు వచ్చే ఏకాదశినాటి నుండి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై శయనింస్తాడు.

దీనినే తొలిఏకాదశిగా పాటిస్తాం. అలాగే ఇది దేవతలందరికీ రాత్రికాలంలో చెప్పబడింది. దక్షిణాయనం ముఖ్యంగా ఉపాసనాకాలం. దైవారాధనలో గడపటానికి అనువైన కాం. అందుకు నిదర్శనంగా దక్షిణాయనంలో కార్తీకమాస ఉపవాసాలు, ధనుర్మాస వ్రతదీక్షలని పాటిస్తాం. వరలక్ష్మీవ్రతం, వినాయకచవితి, దేవీనవరాత్రులు, దీపావళి, కార్తీకమాసం,

ముక్కోటి ఏకాదశి, ఆండాల్‌ తిరునక్షత్రంలాంటి ముఖ్యమైన పండగలు ఈ సమయంలోనే వస్తాయి. ఉత్తరాయనంలో ఇన్ని పండుగలు లేవు. దక్షిణాయనంలో పిత్రుదేవతలని మనం స్మరించుకోవలసిన సమయం.

ఈ సమయంలోనే మహాలయపక్షాలు కూడా వస్తాయి. పిత్రుదేవలకి తర్పణాలు సమర్పించే కాలం. ఈ సమయంలో ఆచరించే మరో కఠినమైన దీక్ష చాతుర్మాసవ్రత దీక్ష. దీని పాటించే వారు భగవంతుడికి ప్రీతిపాత్రులౌతారని భావిస్తారు.

దక్షిణాయనంలో దైవస్మరణచేస్తూ జీవ్ఞలు తమ తమ కర్తవ్యాలన్నిఅంటే, పంటలు పండించడంలాంటి ముఖ్యమైన పనులు చేస్తూ కాలం గడిపాక, దక్షిణాయం చివరిన పంటలు పండి చేతికొస్తాయి.

అప్పటి నుండి భోగం అనుభవించే కాలం మొదలవ్ఞతుంది. ఆసరికే సూర్యుడు ధనుర్రాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించటంతో ఉత్తరాయణం కాలం మొదలౌ తుంది.

పంటలు పండగా వచ్చే ద్రవ్యం చేతిలో సమృద్ధిగా వ్ఞండటంచేత, ఉపనయనం, వివాహాలు, గృహనిర్మాణాలు మొదలగు శుభకార్యాలు ఈ కాలంలో జరుపుకుంటాం.

శుభకార్యాలు జరుపుకునే సమయం కాబట్టి ఉత్తరాయనం శుభప్రదమని భావిస్తారు.

కానీ నిజానికి ఆ సమయంలో మనం శుభకార్యాలకి ఖర్చుచేసి స్థితిలో వ్ఞండటంచేత మాత్రమే శుభకార్యాలు చేస్తాం. ఇది ఆర్థిక స్థితిగతులబట్టి కాలక్రమేనా జరిగేదే తప్పా ఉత్తరాయనం శుభకార్యాలకి గొప్పదని కాదు.

దక్షిణాయనంలో కూడా వివాహాది శుభకార్యాలు జరుపుకోవడం మనం గమనించవచ్చు. దక్షిణాయన, ఉత్తరాయనాలు సంక్రమించే, ముందు పదహారు ఘడియలు (ఘడియంటే సుమారు ఇరవైనాలుగు నిమిషాలు) తరువాత పదహారు ఘడియలు సంధికాలమంటారు

. ఈ సమయంలో ఏ శుభకార్య చేయడానికి పనికిరాదు. దక్షిణాయనంలోకి ప్రవేశించిన తరువాత, స్నానమాచరించి పితృదేవతలకి సంతర్పణలు చేసేకాలం.

ఈ సమయంలో స్నానం, దానం మిక్కిలి ఫలితాలనిస్తాయి.

  • కారంపూడి వెంకట రామదాస్‌

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/