మాతృదేవోభవ – మానసిక వికాసం

మాతృత్వంలోనె వుంది ఆడజన్మ సార్థకం. అమ్మా! అని పిలుపించుకొనుటె స్త్రీ మూర్తికి గౌరవం అన్నారొక సినీకవి.

‘మాతృత్వం అనేది సృష్టికి మూలం. భగవంతుడు నిర్దేశించిన ఒక పవిత్రయజ్ఞం. అందుకే ప్రతివ్యక్తీ ‘మాతృదేవోభవ అని ముందుగా మాతృమూర్తికే నమస్కరించేలా శాసించాడా పర మాత్మ. మాతృత్వం అదేది పిల్లల్ని కనడం మాత్రమే కాదు. దయగల ప్రతిస్త్రీ మాతృమూర్తే అని ఆపరమాత్మ నమ్మకం ఉద్దేశం. పుట్టిన దగ్గర్నించి వారిని గుండెల్లో పెట్టుకుని పెంచుతూ చదువుసస్కారాలు నేర్పుతూ సంస్కారవంతులుగా తీర్చిదిద్దే ప్రతి స్త్రీ మాతృమూర్తే. బిడ్డల్ని ప్రయోజకులుగా చేసి వారి నీడలో వుండే ఆ కన్నవారి ఆనందానికి హద్దులే వుండవు. అయితే
ప్రస్తుత కాలంలో జరుగుతున్న పరిస్థితులని చూస్తుంటేనే మనసులుమంచులా అయిపోతున్నాయని చాలామందికి తెలుసు. ఎందుకిలా మారిపోతోంది సమాజం? అని ప్రశ్నించుకుంటే ఎన్నో చిందర వందర జవాబులు మనసుని అల్లకల్లోలం చేసి కలవర పెడతాయి.

చాలామంది బిడ్డ పుట్టి బారసాల దగ్గర్నించే వారి పెళ్ళిళ్లవరకూ ఆడంబరాలు అట్టహాసాలూ చేసి డబ్బుని తృణ ప్రాయంగా ఖర్చుచేసి గర్వంగా ఫీలవుతున్నారు కలవారు. తమ తాహతుని బట్టి సరదానికి బట్టి సరైన సంపాదనలేని వారు సైతం అయిన దృష్టిలో పెట్టుకుని సరైన సంపాద నలేని వారు సైతం అయిన కొడికి అప్పుచేసి అట్టహా సాలూ ఆర్బాటాలూ చేసిఅప్పులపాలై అల్లాడి పోతున్నారు. ఆవు చేలో మేస్తే దూడగట్టున వేస్తుందా అన్నట్టు వారి సంతానమూ విచ్చలవిడితనానికి అలవాటు పడిపోతున్నాడు.

ఇంక బిడ్డల చదువుల గురించి చెప్పాలంటే చాలావుంది. వాళ్లకి వూహ తెలియకముందే వాళ్లని గురించి ఆకాశానికి నిచ్చెనలు వేసుకుంటున్నట్టు పిల్లలు ‘ఒద్దు మొర్రో
అన్నా కాన్వెంట్స్‌లో పడెయ్యడం, వారు కొరకపోయిన గొప్పకోసం సెల్‌ఫోన్లు, సి.డి. ప్లేయర్సులాంటివి ఇచ్చి క్రమేపీ రంగుల ప్రపంచంలోకి దించేస్తు న్నారు. వాళ్లు పెద్ద చదువులు చదివి విదేశాలకెళ్లి కోట్లు సంపాదించాలని కలలుకంటూ ఆ బిడ్డల్ని కూడా అగాధాల్లో పడేస్తున్నారు.

‘కలలు కనండి. ఆ కలలకి సాకారం చేసుకోండి అంటారు కీ.శే. అబ్దుల్‌ కలామ్‌. అలా చేస్తున్నామా? లేదు. పాత సహాయ సంస్కారాల్లాంటివి నేల మట్టం చేసేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడో తప్ప పాత ఆచార వ్యవహారాలేంలేవు. తాతాయ్య చెప్పేకథలు, అమ్మ పెట్టే గొరుముద్దలు, గురువులు చెప్పే నీతి సూత్రాలు ఇప్పుడున్నాయా? అసలంటూ వాళ్లుంటే కదా. వృద్ధులు వృద్ధాశ్రమాల్లో పడుంటే, నీతిసూత్రాలు, దైవగాధలు బోధించే గురువులు మాయమై, తెలుగు మాట్లాడితే చావగొట్టే టీచర్లు పెరిగిపోయారు. తెలుగు వారే పవిత్ర తెలుగుని ‘తెగులు అని హేళన చేస్తున్నారు. ఇంగ్లీష్‌మీద మోజు పెరిగిపోయింది ఇంగ్లీషేకాదు. పలు భాషలు నేర్చుకొవల్సిందే. కానీ మాతృభాషని హీనంగా చూడడం ఎం అమానుషం? ఇలాంటి పెంపకంలో పెరిగిన పిల్లలు ఎలా వుంటారు. ‘తాతకి పెట్టిన ముంతే తరతరాలు అన్నట్టు సుగుణాల రాశులవుతారా? ‘ఓహో! మమ్మీ, డాడీ వాళ్లు ఓల్డయిపోతే ఓల్డేజ్‌హోమ్‌లో చేర్చాలన్నమాట. ఎక్కడ చేరిస్తే బావుంటుంది? అనుకోవడానికి అవకాశం లేదా? కానీ ఈ నాటికీ రత్నాల్లాంటి పిల్లలున్నారు.

వారి తల్లులే మాతృ మూర్తులు. అంతెందుకు నాకు తెలిసి ఓ కుబేరపుత్రీక దూరాన వున్న ఓ హాస్టల్లో వుండి చదువుకుంటూ గాలతిరుగుళ్లు తిరిగి గర్భవతి అయి. ఆ గర్భాన్ని ఆదిలోనే అంతం చెయ్యడం కుదరక గర్భస్త శిసువుని తిట్టుకుంటూ కాస్త చేరువులో వున్న పల్లెకి ఏదో
టూర్‌ నెపంతో వెళ్లి, భర్త మిలిటరీలోవున్నాడని అతిపేదరాలుగా అక్కడి వారిని నమ్మించి ఓ గుడిశలాంటి ఇంట్లో తిష్టవేసింది. నెలలు నిండగానే ఓ అర్థరాత్రి నెప్పులు రావడంతో వూరికి మూలగా వున్న పొద దగ్గరికెళ్లి, ఎలాగొ ఓ బిడ్డని కని, వాళ్ను ఓ పురుగుని చూసినట్టు చూసి ఏడుస్తున్న ఆశిసువుని ఓ ముళ్ల పొదలోకి విసిరేసి అప్పటిప్పుడు ఫొన్‌చేసి ఓ టాక్సీ తెప్పించు కుని బిడ్డని వదిలించుకుని మాయమైపోయింది.

తెల్లవారగానే ఓ పేదరాలు గొడ్లని మేపడానికొచ్చి ఆ పసివాడి ఏడుపు విని ముళ్లపొదలో పడిదయనీయంగా ఏడుస్తున్న పసివాణ్ని చూసి ఒణికి పోతూ అతికష్టంతో వాణ్ని తీసుకుని గుండెలకి హత్తుకుని తన గుడిశకేసి పరిగెత్తి వాడికి సేదతీర్చి, అతి ప్రయాసగా పాలు పట్టింది.

ఆమెలోని మాతృభావం రెక్కలు విప్పుకుంది. ఆమె కళ్లు శ్రావణమేఘాలై పోయాయి. గుండెలకి మరింతహత్తుకుంటూ..’ఎవరుకన్న బిడ్డవో నాన్న ఆ కన్నయ్య యశోదమ్మ దగ్గరికి చేరినట్టు నా దగ్గరికొచ్చావు. అంటూ వాడికి కన్నతల్లై తను పస్తులుండి మరీ వాణ్ని పోషిస్తూ, కాస్త ప్రాయం వచ్చాక పక్కనే వున్న స్కూల్లో చేర్చించి, తనకి తెలసినంతలో మంచి చెడులు. పాపపుణ్యాలు, దయాధర్మాలు బొధిస్తూ సన్నార్గంలో నడిచేలా ప్రయోజకుల్నీ చేసింది. తనకోసం తల్లి ఎన్ని బాధలు పడుతొందా గమనిస్తున్న ఆ బాలుడు, తన తల్లిని దేవతలా చూసుకోవాలి అనుకునేవాడు వాడికి తల్లంటే ప్రాణం.

అతి బుద్ధిమంతుడిగా, నిజమైనభావి భారతీయ పౌరుడిలా పెరుగుతున్నాడు. మరి ఆ పేదరాలు మాతృమూర్తి కదా?
నిర్దాక్షిణ్యంగా వాణ్నికని ముళ్లకంపలాపడేసిన మహాతల్లి ఎన్నిగాలి తిరుగుళ్లు తిరిగినా, కలవారి బిడ్డకాబట్టి, అన్నీ మాసిపోయి మరొకోటేశ్వరుణ్ని పెళ్లి చేసుకుని, పిల్లల్నికని, ‘డబ్బుంటే ఏంచేసినా పర్వాలేదు అన్నట్టు దర్పాలు చూపిస్తూ, తన పిల్లల్ని ఈనాటి కొందరు పిల్లల్లా, డబ్బే ప్రధానం. ‘తెలుగు, తెగులేఅని గాలివెధవల్లా తయారుచేసి క్లబ్బులు, పబ్బులు వెళ్డడమే
ముఖ్యం అనుకునేలా తయారు చేసింది.

ఇప్పుడు చెప్పండి. అసలైన మాతృమూతృలు ఎవరు?కన్న బిడ్డని ముళ్లకంపలో పడేసి పోయిన మహాతల్లా? లేక అతిపేదరాలైనా ముళ్లకంపలోని పసివాణ్ని గుండెల్లో పెట్టుకుని ప్రయోజకుణ్ణి చేసిన పేదరాలా?

  • రావినూతల సువర్నాకన్నన్‌