7 నుంచి శ్రీవారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుమల: తిరుమ‌ల శ్రీవారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు ఈ నెల 7వ తేదీ నుంచి 15 వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు టీటీడీ స‌ర్వం సిద్ధం చేసింది. బ్ర‌హ్మోత్స‌వాల నేప‌థ్యంలో రేపు శ్రీవారి ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హించ‌నున్నారు. ఈ నెల 6న సాయంత్రం 6 గంట‌ల‌కు ఉత్స‌వాల‌కు అంకురార్ప‌ణ చేయ‌నున్నారు. 15వ తేదీన రాత్రి ధ్వ‌జారోహ‌ణ‌తో బ్ర‌హ్మోత్స‌వాలు ముగియ‌నున్నాయి. క‌రోనా కార‌ణంగా శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/