కాంగ్రెస్ పార్టీలోకి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి?

GHMC Mayor Gadwal Vijayalakshmi into Congress party?

హైదరాబాద్‌ః గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బిఆర్ఎస్ కీలక నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు పలువురు నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారబోతున్నారనే వార్త పొలిటికల్ సర్కిల్ లో వైరల్ అవుతోంది. తాజాగా… నగర మేయర్, బిఆర్ఎస్ పార్టీ కీలక నేత కె.కేశవరావు కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజుల క్రితమే సీఎం రేవంత్ ను విజయలక్ష్మి కలిశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షీతో కాసేపటి క్రితం విజయలక్ష్మి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత రోహిణ్ రెడ్డి కూడా వీరితో పాటు ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో, విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారానికి మరింత బలం చేకూరినట్టయింది.