బిఆర్‌ఎస్‌ బైక్ ర్యాలీలో హుషారుగా మల్లారెడ్డి డ్యాన్స్‌

బిఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు

minister-malla-reddy-dance-on-brs-party-foundation-day

హైదరాబాద్ః మేడ్చల్ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఆ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నాయకులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బైక్ వెనుక కూర్చున్న మల్లారెడ్డి, డ్యాన్స్ చేస్తూ కార్యకర్తల్లో జోష్‌ నింపారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలు, పట్టణాలు, నగరాల్లో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు.