ఈరోజు సాయంత్రం కర్ణాటక కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం

ఈరోజు ఆదివారం సాయంత్రం కర్ణాటక కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. ఏకంగా 136 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి రికార్డు నెలకొల్పింది. కాగా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు జరగనున్న పార్టీ శాసనసభా పక్ష (సీఎల్పీ) సమావేశంలో ఎమ్మెల్యేలు సీఎంను ఎన్నుకోనున్నారు.

సీఎం సీటు కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ మధ్య పోటీ నెలకొన్నప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం సిద్దరామయ్య వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. కాగా, పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ సీనియర్ నేత సుర్జేవాల్ సమక్షంలో జరగనున్న సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ నేతను ఎన్నుకుంటారు. అనంతరం, నేతలు గవర్నర్‌ను కలుస్తారు.