తప్పుడు ఆరోపణలతో బీజేపీ పోరాటాన్ని ఆపలేరు : బండి

టీఆర్ఎస్ శ్రేణులే ఈ దాడులకు పాల్పడుతున్నాయి..బండి సంజయ్

హైదరాబాద్: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నివాసంపై దుండగులు రాళ్లు రువ్విన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె నివాసానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ శ్రేణులే ఈ దాడికి పాల్పడ్డాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారని అన్నారు. శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రలో డీకే అరుణ, జితేందర్ ల పాత్ర ఉందనే ఆరోపణలను ఆయన తప్పుపట్టారు. ఇలాంటి ఆరోపణలను ఎదుర్కోవడం బీజేపీకి కొత్తేం కాదని అన్నారు. కుట్ర వెనుక ఉన్న అన్ని విషయాలను బయటపెడతామని చెప్పారు. తప్పుడు ఆరోపణలతో బీజేపీ పోరాటాన్ని కేసీఆర్ ఆపలేరని అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/