ఏపీకి గుడ్ లక్ః మంత్రి కెటిఆర్ ట్వీట్

రెండు తెలుగు రాష్ట్రాలు గొప్పగా వెలుగొందాలని ఆకాంక్షించిన వైనం

ktr-says-all-the-best-to-ap

హైదరాబాద్‌ః రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా విశాఖలో ఏపీ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రేపు, ఎల్లుండి ఈ సమ్మిట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను నిర్వహిస్తున్న యంగర్ బ్రదర్ వైజాగ్, తోటి రాష్ట్రం ఏపీకి గుడ్ లక్ అని ట్వీట్ చేశారు. ఏపీకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే గొప్ప రాష్ట్రాలుగా వెలుగొందాలని ఆకాంక్షించారు.

మరోవైపు ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ హైదరాబాద్ ను ఏపీకి బిగ్ బ్రదర్ గా సంబోధించారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి గర్వపడుతున్నానని చెప్పారు. హైదరాబాద్ లో ఏపీని ప్రమోట్ చేస్తానని కలలో కూడా అనుకోలేదని అన్నారు. బిగ్ బ్రదర్ అభివృద్ధిని చూసి గర్వపడుతున్నానని చెప్పారు.