అమ్మ నవ్వు చూస్తే అన్నీ మర్చిపోతాం అంటూ చిరు ట్వీట్

ఈరోజు మదర్స్‌ డే సందర్బంగా సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ద్వారా మదర్స్‌ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలోనే మెగాస్టార్‌ చిరంజీవి తల్లి అంజనాదేవి ఫై ట్వీట్స్ చేసారు.

తన తల్లి అంజనమ్మ, ఇద్దరు చెల్లెళ్లతో దిగిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. “అనురాగం, మమకారం… ఈ రెండింటి అర్థమే అమ్మ. అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం అమ్మని చూసే నేర్చుకున్నాం’ అని పోస్ట్ చేశారు.

ప్రస్తుతం చిరంజీవి భోళాశంకర్ మూవీ తో బిజీ గా ఉన్నాడు. మెహర్ రమేష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా , కీర్తి సురేష్ ..చిరు కు చెల్లెలుగా పాత్రలో నటిస్తుంది. ఆగస్టు లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.