తనకు పిల్లలు కావాలంటున్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి పెళ్లి ఫై తన మనసులోని మాటలను ఓ మీడియా ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. 52 ఏళ్ల రాహుల్ ఇంకా పెళ్లి చేసుకోని విషయం తెలిసిందే. బ్యాచలర్ రాహుల్ ఎక్కడికి వెళ్లినా .. ఆయన్ను పెళ్లి ప్రశ్నలే వేస్తున్నారు. అయితే తాజాగా మరోసారి పెళ్లి ప్రశ్న ఎదురైంది.
ఓ ఇటాలియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వివాహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాహుల్. తాను ఇప్పటి వరకు వివాహం ఎందుకు చేసుకోలేదో తెలియదన్న ఆయన.. పిల్లలు కావాలని ఉందని చెప్పుకొచ్చారు. ఇటలీలో ఉండే తన అమ్మమ్మ పావ్‌లామాయినోకు తన సోదరి ప్రియాంక గాంధీ అంటే ఎంతో ఇష్టమని, ప్రాణప్రదంగా చూసుకుంటారని తెలిపారు. అలాగే గడ్డం పెంచడం ఫై కూడా రాహుల్ స్పందించారు. యాత్ర పూర్తయ్యే వరకు గడ్డం తీయకూడదని నిర్ణయించుకుంటున్నట్టు తెలిపారు. అయితే, ఇప్పుడా గడ్డాన్ని ఉంచాలా? తీసేయాలా? అన్న విషయాన్ని ఇంకా నిర్ణయించుకోలేదని అన్నారు.