మార్చి నెలలో ఏకంగా బ్యాంకులకు 12 రోజులు సెలవులు

మరో ఆరు రోజులైతే ఫిబ్రవరి నెల పూర్తి అవుతుంది. ఈ క్రమంలో మార్చి నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు రాబోతున్నాయనేదానిపై ఖాతాదారులు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మాములుగా ఈ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేస్తాయి..ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు అనేవి చూస్తుంటారు. వాటిని బట్టి తమ బ్యాంకు పనులను చేసుకుంటుంటారు. ఇక మార్చి నెల రాబోతుంది. ఈ నెలలో ఏకంగా బ్యాంకులకు 12 రోజులు సెలవులు రాబోతున్నాయి.

అవి ఏ తేదీన..ఎందుకు సెలవొ చూద్దాం.

మార్చి 3 : శుక్రవారం నాడు చప్చార్ కుట్ సెలవు దినం సందర్భంగా మణిపూర్‌లో బ్యాంకులు క్లోజ్..
మార్చి 5: ఆదివారం కనుక అన్ని చోట్ల సెలవే.
మార్చి 7: మంగళవారం నాడు హోలీ. హోలికా, దహన్, ధులాండి, దోల్ జాత్రా పేర్లతో వివిధ రాష్ట్రాలో ఈ పండుగని జరుపుతారు. చాలా రాష్ట్రాల్లో హోలీ రోజున బ్యాంకులు
క్లోజ్.
మార్చి 8: ధులేటి, దొల్యాత్రా, హోలీ, యాసాంగ్ కారణంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకి సెలవు.
మార్చి 9: ఈ రోజున బిహార్‌లో హోలీ వేడుకలు చేసుకుంటారు. ఆ రోజున బిహార్ రాష్ట్రంలో బ్యాంకులు బంద్.
మార్చి 11: మార్చి 11 రెండో శనివారం.
మార్చి 12: ఆదివారం అన్ని బ్యాంకులు క్లోజ్ ఏ.
మార్చి 19: ఆదివారం అన్ని బ్యాంకులు క్లోజ్ ఏ.
మార్చి 22: ఉగాది, బిహార్ దివాస్, తెలుగు కొత్త సంవత్సరం పండగలు కనుక పలు రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు.
మార్చి 25: నాల్గవ శనివారం
మార్చి 26: ఆదివారం అన్ని బ్యాంకులు క్లోజ్ ఏ.
మార్చి 30: శ్రీరామ నవమి కారణంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు.

ఇలా మొత్తం 12 రోజులు సెలవులు రాబోతున్నాయి.