ఎంపీటీసీ-జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలతో పాటు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదల

అమరావతి: ఏపిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మొదటి దశ ఎన్నికలు మార్చి 21న, రెండో దశ ఎన్నికలను మార్చి 24న జరగనున్నాయి. ఇక మున్సిపల్ ఎన్నికలు మార్చి 27న నిర్వహిస్తారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలతో పాటు మున్సిపల్ ఎన్నికల ఫలితాలను కూడా మార్చి 29న ప్రకటిస్తారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/