హాస్పటల్ నుండి కమల్ హాసన్ డిశ్చార్జి

లోకనాయకుడు కమల్ హాసన్ హాస్పటల్ నుండి డిశ్చార్జి అయ్యారు. రెండు రోజుల క్రితం స్వల్ప అస్వస్థత తో చెన్నై లోని పోరూరు రామచంద్ర హాస్పటల్ చేసిన సంగతి తెలిసిందే. హాస్పటల్ లో చేరే సమయంలో జ్వరంతో పాటు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. రెండు రోజులు ఆయనకు చికిత్స అందించిన డాక్టర్స్ ఆయన పూర్తిగా కోలుకోవడం తో శుక్రవారం ఆయన్ను డిశ్చార్జి చేశారు.

గత బుధవారం హైదరాబాద్ వచ్చిన కమల్ హాసన్… దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ ను కలిశారు. విశ్వనాథ్ ఆశీర్వాదం తీసుకొని , ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అందుకు సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. విక్రమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకొని , మళ్లీ సక్సెస్ బాట పట్టారు. ప్రస్తుతం కమల్ తమిళ బిగ్‌బాస్ సీజన్-6తో పాటు, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్-2 (భారతీయుడు-2) షూటింగుతో బిజీగా ఉన్నారు. ఇండియన్-2 షూటింగ్ పూర్తయిన వెంటనే ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న ‘కేహెచ్ 234’‌ షూటింగ్‌లో జాయిన్ అవుతారు.