తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

TSPSC
TSPSC

తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది రాష్ట్ర సర్కార్. 9,168 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (TSPSC) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు . ఈమేరకు అనుమతి ఇస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇటీవల తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇప్పటికే 503 గ్రూప్‌ 1 పోస్టులకు ప్రిలిమ్స్‌ పరీక్షలను పూర్తిచేసింది. దీనికి సంబంధించి ప్రాథమిక ఆన్సర్‌ కీ కూడా విడుదల చేసింది. ఇక గ్రూప్‌ -2 కింద 663 పోస్టులకు, గ్రూప్‌-3 కింద 1373 పోస్టులకుఅనుమతి తెల్పింది. ఇక ఇప్పుడు 9,168 గ్రూప్‌-4 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉత్తర్వుల్లో పేర్కొంది.