కరోనా కొత్త లక్షణాన్ని గుర్తించిన వైద్యులు

ఇటలీకి చెందిన ఓ అధ్యయనంలో వెల్లడి

New symptom of novel coronavirus infection
New symptom of novel coronavirus infection

అమెరికా: కరోనా మహమ్మారిలో కొత్త లక్షణాన్ని చర్మ వైద్య నిపుణులు గుర్తించారు. యూరప్, అమెరికాలోని చర్మ వైద్య నిపుణులంతా ఇప్పుడు దాని గురించే చర్చించుకుంటున్నారు. కరోనా సోకిన వారిలో కొందరికి కాలి వేళ్ల దగ్గర, చేతి వేళ్ల దగ్గర రక్తం గడ్డకట్టి చర్మం ఎర్రబారుతున్నట్లు గుర్తించారు. అయితే.. ఈ లక్షణం ఎక్కువగా చిన్నారులలో, టీనేజ్ వారిలో కనిపిస్తున్నట్లు తెలిసింది. తొలుత ఈ లక్షణాలు యూరప్‌లో కనిపించగా, తాజాగా అమెరికాలో కూడా ఈ లక్షణం కనిపించినట్లు చర్మ వైద్య నిపుణులు తేల్చారు. అయితే.. ఈ లక్షణం ఎక్కువగా శీతల ప్రదేశాలలో నివసించే వారిలో మాత్రమే కనిపిస్తున్నట్లు తెలిపారు.

పాదాలపై దద్దుర్లు ఉన్నా కరోనా సోకిందని అనుమానించొచ్చని చెబుతున్నారు. ఇటలీకి చెందిన ఓ అధ్యయనం ప్రకారం.. కరోనా వైరస్ సోకిన ప్రతి ఐదుగురిలో ఒకరికి చర్మ సంబంధ సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. అంటే బాధితుల చర్మం మీద ఎర్రటి దద్దుర్లు వస్తున్నాయి. ‘ఇటలీలో  దాదాపు 20 శాతం మంది బాధితులకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. ఫిన్లాండ్, స్పెయిన్, అమెరికా, కెనడాలోని వైద్యులు కూడా కరోనా బాధితుల్లో చర్మంపై ఎర్రటి మచ్చలు, దద్దుర్లు ఉన్నట్టు గుర్తించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/