కళ్యాణ్ రామ్ “డెవిల్” షూటింగ్ పూర్తి

నందమూరి కళ్యాణ్ రామ్ – సంయుక్త మీనన్ జంటగా నవీన్ మేడారం డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం డెవిల్. స్పై థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నాడు. ఈ మూవీని ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా ప్రొడ్యూస్ చేస్తుండగా.. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిన ఈ మూవీ సెట్స్ నుంచి హీరో, హీరోయిన్, నిర్మాత అభిషేక్ నామా కలిసి దిగిన పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేసారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించనున్నట్లు తెలిపారు.