ఇల్లు ఇచ్చిన ఓనర్ కు బలగం డైరెక్టర్ కనీసం ఫోన్ కూడా చేయలేదట ..

ఈ మధ్య విడుదలైన చిత్రాల్లో భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన చిత్రం బలగం. జబర్దస్త్ ఫేమ్ వేణు డైరెక్షన్లో దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. పల్లెల్లో కూడా స్క్రీన్ లు ఏర్పాటు చేసి సినిమాను ప్రదర్శిస్తున్నారంటే ఈ సినిమా ఎంతగా ఆకట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి సినిమాకు డైరెక్ట్ చేసిన వేణు..ఈ సినిమా కోసం తన ఇంటినే షూటింగ్ ఇచ్చిన ఓనర్ కు ఫోన్ చేయలేదట..కనీసం థాంక్స్ చెప్పలేదట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపారు.

ఈ సినిమా షూటింగు అంతా కూడా ‘సిరిసిల్ల’ పరిసర ప్రాంతాల్లో జరిగిన విషయం తెలిసిందే. లొకేషన్స్ లో హీరో ఇల్లు కూడా ఒకటి. షూటింగు కోసం ఈ ఇంటిని ఇచ్చిన రవీంద్రరావు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు.

‘బలగం’ సినిమా డైరెక్టర్ వేణు మా ఊరు వాడే. ఇట్లా దిల్ రాజుగారు ఒక ఛాన్స్ ఇచ్చారు .. హెల్ప్ చేయండి అని అడిగితే నా ఇల్లు ఇచ్చాను. నెలా పదిహేను రోజుల పాటు ఈ ఇంట్లో షూటింగు చేశారు. అప్పటివరకూ మేము వేరే ఇంట్లో ఉన్నాము. వేణు దగ్గర మేము ఒక రూపాయి కూడా తీసుకోలేదు. ఈ సినిమా ఇంతపెద్ద హిట్ అవుతుందని మేము అనుకోలేదు. ఈ సినిమాలో మా ఇల్లు ఉండటం మాకు సంతోషాన్ని కలిగించింది” అన్నారు. సినిమా ఇంత పెద్ద హిట్ అయిన తరువాత వేణు థ్యాంక్స్ చెప్పలేదు .. ఫోన్ కూడా చేయలేదు. నా నెంబర్ ఆయన దగ్గర ఉంది గానీ .. మేము గుర్తుకురాలేదు. ఆయన నుంచి ఇవేమీ నేను ఆశించలేదు కూడా. ఈ సినిమా కోసం ఇష్టంగా ఇల్లు ఇచ్చాను అంతే ” అన్నారు. కానీ లోలోపల మాత్రం చాల బాధపడుతున్నట్లు స్పష్టంగా అర్ధం అవుతుంది.