కరోనా అనాధ శవాల అంత్యక్రియల్లో ఎమ్మెల్యే ‘భూమన’
దైవ కార్యంగా భావించే తానూ అంతిమ సంస్కారాలు చేస్తున్నట్టు వెల్లడి

Tirupati: కరోనాతో మృతిచెందిన 7 అనాధ శవాలకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అంత్యక్రియలు జరిపారు. హరిశ్చంద్ర స్మశాన వాటికలో ఏడుగురు అనాధ కోవిడ్ మృతులకు సాంప్రదాయబద్దంగా దహన సంస్కారాలు నిర్వహించారు. దైవ కార్యంగా భావించే తానూ అనాధ మృతదేహాల అంతిమ సంస్కారాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. కరోనా మొదలైన నాటి నుండి తిరుపతిలో సహచరులు, మిత్రులు జెఏసిగా ఏర్పడి అనాధ మృత దేహాలకు ఖననం చేసే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు 700 కు పైగా అనాధల మృత దేహాలకు ఖననం చేసే కార్యక్రమంలో పాల్గొన్నామని ఆయన వెల్లడించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/