అమరావతి పేరుతో చంద్రబాబు ముడుపులు తీసుకున్నారుః మంత్రి కాకాణి

ఐటీ షోకాజ్ నోటీసులతో విషయం ప్రజలకు అర్థమయిందని వ్యాఖ్య

kakani comments on chandrababu

అమరావతిః రాజధాని అమరావతి పేరుతో టిడిపి అధినేత చంద్రబాబు భారీగా ముడుపులు తీసుకున్నారని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. పూర్తి వివరాలతోనే చంద్రబాబుకు ఐటీ శాఖ షోకాజ్ నోటీసులను జారీ చేసిందని చెప్పారు. ఐటీ షోకాజ్ నోటీసులతో చంద్రబాబు కమీషన్లు తీసుకున్నారనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయిందని అన్నారు. టిడిపి హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ తాము ఎప్పటి నుంచో చేసిన ఆరోపణలకు ఐటీ షోకాజ్ నోటీసులు ఉదాహరణ అని చెప్పారు. వివిధ కార్యక్రమాలు, పథకాలలో చంద్రబాబు ఎంత కమీషన్లు స్వీకరించారో తేలాల్సి ఉందని అన్నారు. మరోవైపు తనపై వైఎస్‌ఆర్‌సిపి నేతలు చేస్తున్న ఆరోపణలపై చంద్రబాబు స్పందించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తనపై అనేక కేసులు వేశారని… తాను తప్పు చేసినట్టు ఒక్కటైనా నిరూపించారా? అని ప్రశ్నించారు.