చీరలో అనుపమ కిరాక్ పుట్టిస్తుంది

అ ఆ బ్యూటీ అనుపమ చీరలో మత్తెక్కిస్తోంది. చిత్రసీమలో రాణించాలంటే నటన తో పాటు గ్లామర్ కూడా అవసరం..కానీ ఈరోజుల్లో నటన కంటే గ్లామర్ నే ఎక్కువగా చూస్తున్నారు ఆడియన్స్. తెరపై ఎంతగా అందాల ఆరబోత చేస్తే అంతగా ఛాన్సులు ఇస్తున్నారు. ప్రస్తుతం రాణిస్తున్న భామలంతా కూడా అందాల ఆరబోతనే నమ్ముకొని ఛాన్సులు కొట్టేస్తున్నారు. కేవలం వెండితెర ఫై మాత్రమే కాదు సోషల్ మీడియా లోను సెగలు రేపుతున్నారు. అయితే అనుపమ మాత్రం మొదటి నుండి గ్లామర్ ను నమ్ముకోకుండా నటన కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. దీంతో అమ్మడి కంటే వెనుకాల వచ్చిన వారు టాప్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతుంటే అనుపమ మాత్రం అక్కడే ఉంది. దీంతో అమ్మడు కూడా తన ఆలోచన మార్చుకుంది. గ్లామర్ నే నమ్ముకొని సోషల్ మీడియా లో రచ్చ చేస్తుంది. రీసెంట్ గా రౌడీ బాయ్స్ మూవీ లో లిప్ లాక్ చేసి ఆశ్చర్య పరిచిన ఈ భామ..సోషల్ మీడియా లో హాట్ హాట్ భంగిమలతో ఆకట్టుకుంటుంది.

తాజాగా చీరకట్టులో కనిపించి అందర్నీ కట్టిపడేసింది. చీర కట్టులో అందంగా కనిపించడమే కాకుండా అనుపమ ముక్కుపుడక కూడా ఈమె అందాన్ని పెంచేలా కనిపిస్తోంది. ఈ ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా కుర్రకారుల హృదయాలను గాయం చేస్తోంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఒక అభిమాని ఒక్కొక్క పోస్టుకి ఒక్కొక్కసారి చంపేసే బదులు ఒకేసారి విషం ఇచ్చి చంపేయొచ్చు కదా బుజ్జమ్మ అంటూ అనుపమను ట్యాగ్ చేసి కామెంట్ చేసాడు. ప్రస్తుతం అనుపమ..నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘18పేజెస్’ ఫిల్మ్ లో నటిస్తోంది. ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.