ఇండియా పేరును భారత్ గా మారిస్తే మంచిదేః రోజా

ఇంగ్లీష్ లో ఇండియా అని పిలవడం కంటే భారత్ అని పిలిస్తే బాగుంటుందని వ్యాఖ్య

bharat-name-is-better-than-india-says-roja

తిరుమలః మన దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మారుస్తున్నారనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి రోజా స్పందించారు. ఇండియా పేరును భారత్ గా మారిస్తే మంచిదేనని చెప్పారు. ఇంగ్లీష్ లో ఇండియా అని పిలవడం కంటే మన భాషలో భారత్ అని పిలవడం బాగుంటుందని అన్నారు. భారత్, భారతదేశం అనే పదాలు చిన్నప్పటి నుంచి మనకు సుపరిచితం అని చెప్పారు. ఇండియా పేరును భారత్ గా మారిస్తే స్వాగతిస్తానని అన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు రోజా దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ ఆమె పై వ్యాఖ్యలు చేశారు.