సీఎం జగన్ కు లేఖ రాసిన కైకాల సత్యనారాయణ

మీ సహాయం మరువలేనిది.. కైకాల


హైదరాబాద్: సీఎం జగన్ కు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ నేడు లేఖ రాశారు. తన అనారోగ్య సమయంలో సహాయం అందించి ప్రత్యేక శ్రద్ద చూపించడం సంతోషమేసిందని ఆయన అన్నారు. ఈ మేరకు సీఎం ‏కు కైకాల ఓ లేఖ రాశారు. గతేడాది నవంబర్‏లో తీవ్ర అనారోగ్యంతో కైకాల సత్యనారాయణ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడ ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో మెరుగుపడింది. పూర్తిగా కోలుకున్న కైకాల ఏపీ సీఎం జగన్‏కు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు.

అలాగే తన అనారోగ్య సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన అందరికీ ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. తాను ఆసుపత్రిలో ఉన్న సమయంలో తనకు అందించిన అమూల్యమైన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా కాల్ చేసి, ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిస్తామని హామీ ఇవ్వడం ద్వారా మీరు చూపిన శ్రద్ధకు పట్ల నేను చాలా సంతోషిస్తున్నానని ఆయన అన్నారు. మీరు హామీ ఇచ్చినట్టుగానే మీ ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా హాజరయ్యారు, వైద్య ఖర్చులను తీర్చడానికి ఆర్థిక సహాయంతో సహా అన్ని రకాల సహాయాన్ని అందించారు. ఆ కష్ట సమయాల్లో మీ సహాయం నాకు, నా కుటుంబానికి అద్భుతమైన శక్తిని ఇచ్చిందని ఆయన అన్నారు.

.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/