ఓట‌ర్ల‌కు ఉచిత హామీలు.. రెండు రాష్ట్రాల‌కు సుప్రీం కోర్టు నోటీసులు

“Burden On Taxpayers”: Supreme Court Issues Notice To MP, Rajasthan Govts On Plea Alleging Freebies Ahead Of Polls

న్యూఢిల్లీ: ఈరోజు సుప్రీంకోర్టు ప‌న్నుదారుల డ‌బ్బుతో ఓట‌ర్లకు ఉచితాల‌ను ఇవ్వ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ దాఖ‌లైన పిటీష‌న్‌పై నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సుప్రీం నోటీసులు ఇచ్చింది. చీఫ్ జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్, జ‌స్టిస్ జేబీ ప‌ర్దివాలా, జ‌స్టిస్ మిశ్రాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఆ పిల్‌ను విచారించింది. ఎన్నిక‌ల సంఘం, రిజ‌ర్వ్ బ్యాంక్‌కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు రాష్ట్రాలు త‌మ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ఉచిత ప్ర‌క‌ట‌నలు చేస్తున్నాయ‌ని పిల్‌లో ఆరోపించారు. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌భుత్వాలు ఓట‌ర్ల‌కు డ‌బ్బును పంపిణీ చేయ‌డం దారుణ‌మ‌ని, ఎన్నిక‌ల వేళ ప్ర‌తిసారి ఇదే జ‌రుగుతోంద‌ని, ప‌న్నుదారుల‌పై ఆ భారం ప‌డుతుంద‌ని పిల్ త‌ర‌పున న్యాయ‌వాది వాదించారు. ఉచిత హామీల‌ను వ్య‌తిరేకిస్తూ భ‌ట్టూలాల్ జైన్ సుప్రీంలో పిల్ దాఖ‌లు చేశారు.