మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కు భారీ బందోబస్తు

Earlier by-election polling was huge

Community-verified icon


మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ రేపు జరగబోతుంది. ఈ క్రమంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పటు చేస్తున్నట్లు సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. సుమారు 2వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పించామన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో కనీసం తొమ్మిది మంది సిబ్బంది ఏర్పటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో సీసీ కెమెరాల నిఘా ఉంటుందన్న ఆయన.. చెక్‌ పోస్టులు గురువారం ఎన్నికలు ముగిసే వరకు ఉంటాయని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిని బైండోవర్‌ చేశామని, ఇప్పటి వరకు రూ.4కోట్ల నగదును సీజ్‌ చేసినట్లు వివరించారు.

మునుగోడు నియోజకవర్గంలో రేపు ఉదయం 7 గంటలకు ఉపఎన్నిక పోలింగ్‌ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగనుంది. నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,21,720 మంది పురుషులు, 1,20,128 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ నెల 6న ఓట్లను లెక్కించనున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఈ ఉపఎన్నికను పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి బరిలో నిలిచారు.