రేవంత్ తో కలిసి KA పాల్ ఫారెన్ టూర్ ..?

తెలంగాణ అసెంబ్లీలో సందడి చేశారు. అసెంబ్లీ హాల్లో పలువురు అధికారులు, రాజకీయ నేతలతో ముచ్చటించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించి.. సీఎం జగన్ను విమర్శించారు. రేవంత్ ఆంగ్ల భాషపై విమర్శలు సరికాదన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు కూడా ఇంగ్లిష్ రాదని తెలిపారు. అప్పులతో సీఎం జగన్ రాష్ట్రాన్ని ముంచారని విమర్శించారు.

పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను విదేశీ పర్యటనలకు వెళ్ళాలని అనుకుంటున్నామని పాల్ చెప్పుకొచ్చారు.మన తెలంగాణ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు వెళ్తామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు అసెంబ్లీకి వచ్చానని తెలిపారు. అక్టోబర్ 2న హైదరాబాద్‌లో గ్లోబల్ పీస్ సమ్మిట్ ఉంటుందని..

విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకే ఈ సమ్మిట్ అని క్లారిటీ ఇచ్చారు. గత 10 ఏండ్లలో కేసీఆర్ రూ.12 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారు పర్ఫెక్ట్ లీడర్ అని.. తమ్ముడు రేవంత్ రెడ్డి పాలన బాగుందని కొనియాడారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతారని నమ్మకం ఉన్నదని ఆశా భావం వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వైజాగ్ నుండి ఎంపీగా పోటీ చేస్తున్నాని కేఏ పాల్ ప్రకటించారు.