బడ్జెట్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్

తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి బడ్జెటన్‌ను శనివారం ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, శాసనసమండలిలో మంత్రి శ్రీధర్ బాబు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ పద్దును ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ఫై మంత్రో పొన్నం ప్రభాకర్ స్పందించారు.

మాది ప్రజా సంక్షేమ బడ్జెట్ , మా ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉందని.. వాటి అమలుకు అనుగుణంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయన్నారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి నెలకి 300 కోట్ల చొప్పున అదనపు నిధులు కేటాయించినట్లు తెలిపారు. బీసీ సంక్షేమం కోసం బడ్జెట్‌లో 8000 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో బీసీ గురుకుల భవనాల కోసం రూ.1546 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.