టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారికి రూ.2 లక్షల బీమా

తెలుగుదేశం పార్టీ గుడ్ న్యూస్ తెలిపింది. టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారికి రూ.2 లక్షల బీమా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నేడు ఏపీలోని ఎన్టీఆర్ భవన్​లో పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రారంభించారు. ఈ సందర్భాంగా సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల ప్రమాద బీమా కూడా ఇవ్వనున్నట్లు ప్రకటన చేసి ఆనందం నింపారు. ఈసారి ఆన్​లైన్​లో సభ్యత్వం తీసుకునే విధానాన్ని తెలుగుదేశం అందుబాటులోకి తెచ్చింది. వాట్సప్, టెలిగ్రామ్, మన టీడీపీ యాప్​ల ద్వారా సభ్యత్వం పొందే వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే సభ్యత్వం ఉన్నవారు పునరుద్ధరించుకోవచ్చు. 9858175175 నెంబర్​కు వాట్సాప్ నుంచి హాయ్ అని సందేశం పంపిస్తే.. నమోదు ప్రక్రియ మొదలవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లోనూ సభ్యత్వ నమోదు, లేదా పునరుద్ధరణ చేసుకోవచ్చని తెలుగుదేశం నాయకులు తెలిపారు.

ఇక ఇది ఇలా ఉండగా..ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం ఆర్టీఏ అధికారులు ఒంగోలులో ప్రజల కార్లు లాక్కెళ్ళడం రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు నిదర్శనమన్నారు. కుటుంబంతో తిరుమల దర్శనానికి వెళ్తున్న వినుకొండ వాసి వేముల శ్రీనివాస్ వాహనాన్ని రవాణా శాఖ అధికారులు బలవంతంగా తీసుకు వెళ్ళడం దారుణం అని పేర్కొన్నారు. భార్యా, పిల్లలతో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డున దింపేసే హక్కు ఈ అధికారులకు ఎవరిచ్చారు? అనిఆగ్రహించారు. సీఎం కాన్వాయ్ కోసం కారు పెట్టుకోలేని స్థితికి రాష్ట్రం ఎందుకు వెళ్ళింది? ప్రభుత్వ అధికారులే ఇలాంటి చర్యలకు పాల్పడడం ద్వారా ప్రజలకు ఏమి చెప్పాలి అనుకుంటున్నారు? అని ఆగ్రహించారు.